KTR | హైదరాబాద్ : మంగళూరు వేదికగా జరుగుతున్న 77వ జాతీయ సీనియర్ అక్వాటిక్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ రజత పతకంతో మెరిసిన సంగతి తెలిసిందే. రజత పతకం సాధించిన వ్రితి అగర్వాల్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. అక్వాటిక్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల ఫ్రీస్టైల్‌లో రజత సాధించినందుకు అగర్వాల్‌కు కేటీఆర్ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. వ్రితి అగర్వాల్ మా హృదయాల్లో అలలు సృష్టించారు. తెలంగాణకు మరింత గౌరవం కల్పించారని కేటీఆర్ ప్రశంసించారు.
మంగళవారం జరిగిన మహిళల 400మీటర్ల ఫ్రీస్టయిల్ రేసులో వ్రితి 4:25:09 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి పతకాలు సాధించిన వ్రితి..అదే దూకుడు కొనసాగిస్తున్నది. ఇదే విభాగంలో పోటీపడ్డ హర్షిత రామచంద్ర(కర్ణాటక), భవ్య సచ్దేవ(ఢిల్లీ) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు దక్కించుకున్నారు.
Heartiest congratulations to Telangana’s daughter, Vritti Agarwal, for securing a silver in the 400m freestyle at the 77th Senior National Aquatic Championship! 🏅
You’ve made waves in the pool and in our hearts. Keep making Telangana proud! pic.twitter.com/39trHIZqpU
— KTR (@KTRBRS) September 11, 2024
ఇవి కూడా చదవండి..
Vinesh Phogat: ఓ ఫోటో తీసి రాజకీయం చేశారు.. పీటీ ఉషపై వినేశ్ ఫోగట్ ఫైర్
Afghanistan Vs New Zealand: ఆఫ్ఘన్, కివీస్ మధ్య టెస్ట్ మ్యాచ్.. మూడో రోజు ఆట కూడా రద్దు
‘పారా’ విజేతలకు నజరానా.. స్వర్ణం గెలిచిన వారికి రూ.75 లక్షలు