Vinesh Phogat: ఓ ఫోటో తీసి రాజకీయం చేశారు.. పీటీ ఉషపై వినేశ్ ఫోగట్ ఫైర్
Vinesh Phogat: ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషపై ఆగ్రహం వ్యక్తం చేసింది రెజ్లర్ వినేశ్ ఫోగట్. పారిస్ ఒలింపిక్స్ సమయంలో ఓ ఫోటో తీసి రాజకీయం చేసినట్లు ఆమె ఆరోపించారు. తన అనుమతి లేకుండానే పరామర్శించిన ఫోటోను రిలీజ్ చేశారని వినేశ్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్(Vinesh Phogat).. 53 కిలోల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్ ఫైనల్ రోజున అధిక బరువుతో అనర్హత వేటుకు గురైన విషయం తెలిసిందే. ఆ రోజున నీరసించిన వినేశ్‌కు ఒలింపిక్స్ విలేజ్‌లోని క్లినిక్‌లో చికిత్స చేశారు. ఆ సమయంలో భారత ఒలింపిక్ సంఘ అధ్యక్షురాలు పీటీ ఉష.. ఆ రెజ్లర్‌ను పరామర్శించారు. అయితే ఆ ఇద్దరి భేటీకి చెందిన ఓ ఫోటోను కూడా రిలీజ్ చేశారు. ఆ ఫోటోపై ఇప్పుడు రెజ్లర్ వినేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఫోటో క్లిక్ చేసి, ఆ అంశాన్ని రాజకీయం చేసినట్లు రెజ్లర్ ఆరోపించారు. పీటీ ఉష వ్యవహరించిన తీరును వినేశ్ తప్పుపట్టారు. తనకు తెలియకుండా ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారని పీటీ ఉషపై వినేశ్ ఫోగట్ ఆరోపణలు చేశారు.
పీటీ ఉష నుంచి తనకు ఎటువంటి మద్దతు లభించలేదని రెజ్లర్ వినేశ్ తెలిపారు. తనకు ఎటువంటి మద్దతు లభించిందో తనకు తెలియదన్నారు. ఓ స్థానిక న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె మాట్లాడుతూ.. పీటీ ఉష మేడం హాస్పిటల్‌ను తనను కలిశారని, ఓ ఫోటో తీశారని, మీరు చెప్పినట్లే, రాజకీయాల్లో తెరవెనుక చాలా జరుగుతుందన్నారు. అలాగే పారిస్‌లోనూ రాజకీయం జరిగిందన్నారు. అందుకే తన గుండె పగిలిందని, రెజ్లింగ్ వీడవద్దు అని చాలా మంది వేడుకున్నారని, ఎక్కడకు వెళ్లిన రాజకీయం ఉందని వినేశ్ తెలిపారు.
సోషల్ మీడియాలో ఫోటోను షేర్ చేసిన పీటీ ఉష వైఖరి సరిగా లేదని వినేశ్ ఆరోపించారు. మద్దతు ప్రకటించేందుకు అది సరైన విధానం కాదన్నారు. అది మద్దతు కాదు నటన అన్నట్లు వినేశ్ పేర్కొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

