నోయిడా: న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్(Afghanistan Vs New Zealand) మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్‌లకు వర్షం అడ్డుగా మారింది. ఇవాళ మూడో రోజు కూడా ఆట ప్రారంభం కాలేదు. గ్రేటర్ నోయిడాలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను.. నిన్న రాత్రి వర్షం కురవడంతో.. ఇవాళ్టి మ్యాచ్‌ను ఇంకా ప్రారంభించలేదు. మూడో రోజు కూడా ఇప్పటి వరకు టాస్ పడలేదు. వర్షం లేకున్నా.. నోయిడా పిచ్ తడిగా ఉండడం ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం ఇంత వరకు రెండు జట్లు వేదిక వద్దకు రాలేదు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల.. గ్రేటర్ నోయిడా మైదానంలో తడి ఆరడం మరింత ఆలస్యం అవుతుందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.
ఈ నెల 9 నుంచి 13 మధ్య నోయిడాలోని షాహీద్ విజయ్ సింగ్ పతీక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా ఈ టెస్టు జరగాల్సి ఉంది. మైదానంలో సరిపోని కవర్లు లేకపోవడంతో.. వర్షం నుంచి గ్రౌండ్‌ను కాపాడుకోవడం కష్టంగా మారింది. అరుణ్ జైట్లీ స్టేడియం నుంచి క్యూరేటర్‌ను తీసుకొచ్చినా.. ఏ ఫలితం దక్కలేదు. దీంతో తొలి రెండు రోజులు ఒక్క బంతి పడకుండానే ఆట రద్దు అయ్యింది. ఇక ఇవాళ మూడవ రోజు కూడా ఇప్పటి వరకు టాస్ పడలేదు. కాన్పూర్ లేదా బెంగుళూరులో మ్యాచ్‌ను నిర్వహించుకునే అవకాశం కల్పించినా.. ఆఫ్ఘనిస్తాన్ ఆ అవకాశాన్ని వాడుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
More rain overnight in Noida. Likely further delays to the start of the Test on day three #AFGvNZ pic.twitter.com/U8qvM5mS6n
— BLACKCAPS (@BLACKCAPS) September 11, 2024