KTR | రాజన్న సిరిసిల్ల : కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మాదిరి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారులపై సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇప్పుడు అహంకారంతో అడ్డగోలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారులకు శిక్ష తప్పదు.. రిటైర్ అయినా రికవరీ చేయించే బాధ్యత తానే తీసుకుంటానని కేటీఆర్ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లా, కార్యకర్తల మాదిరి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చిన్న చిన్న పల్లెలను గ్రామపంచాయతీలుగా మార్చి 54 కొత్త రేషన్ దుకాణాలు ఏర్పాటు చేశాం. ఆ రేషన్ దుకాణాలను స్థానికంగా ఉండే పొదుపు సంఘాలకు అప్పజెప్పాం. తద్వారా వారికి కొంత ఆదాయం వస్తదని అప్పజెప్పాం. మరి నువ్వేం చేశావు. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకుడు తానే రాజు, తానే మంత్రి అన్నట్టు.. నేనే ప్రభుత్వాన్ని నడుపుతున్న అన్నట్టు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు అధికారులు వంతపాడుతూ ఆగమాగం అవుతున్నారు. మొన్న ఏపీలో ఏం జరిగిందో చూడండి.. ఆలిండియా సర్వీస్ ఆఫీసర్లు కూడా సస్పెండ్ అయ్యారు. చట్టం ప్రకారం కాకుండా ఇష్టమొచ్చినట్టు చేస్తాం అంటే తప్పకుండా ఫలితం అనుభవిస్తారు. ఆలిండియా సర్వీసు ఆఫీసర్లు, పోలీసులు, ఆర్డీవోలు, కలెక్టర్లు ఎవరైనా ఫలితం అనుభవిస్తారు. చట్టం ప్రకారం, ఒళ్లు దగ్గర పెట్టుకోని పని చేయండి. ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే ఊరుకోం. మరో నాలుగేండ్లలో మళ్లీ కేసీఆర్ తిరిగి వస్తరు.. మీ సంగతి తప్పకుండా చూస్తాం అని కేటీఆర్ హెచ్చరించారు.
కలెక్టర్, ఆర్డీవోను అడుగుతున్నా.. 54 రేషన్ దుకాణాలకు 480 మంది దరఖాస్తు చేసుకున్నారు. పారదర్శకత పాటించకుండా లక్షల రూపాయాలకు ఆ పోస్టులను అమ్ముకున్నారని కాంగ్రెస్ నాయకులే ప్రెస్మీట్లు పెట్టి ఆరోపిస్తున్నారు. అర్హత ఉన్న బాధితులేమో వాటర్ ట్యాంక్‌లు ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌ను, స్థానిక మంత్రులను ఈ విషయంలో సూటిగా అడుగుతున్నా.. రాతపరీక్ష పెట్టామని అంటున్నారు కదా.. మెరిట్ లిస్ట్ బయటపెట్టండి.. వెంటనే జాబితా ప్రకటించండి. పీజీలు, డిగ్రీలు చదువుకున్నోళ్లకు మార్కులు రావట. పదో తరగతి పాసైన వారికి మార్కులు వస్తాయట.. కాంగ్రెస్ కండువా కప్పుకుంటే, లక్షలు సమర్పించుకుంటే మార్కులు వస్తాయట. ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తారా..? లక్షల రూపాయాలకు పోస్టులను అమ్ముకుంటారా..? మళ్లీ మా టైం వస్తది.. తప్పకుండా అధికారులకు శిక్ష పడుతది. రిటైర్ అయినా రికవరీ చేయిస్తాం.. అతి చేసే వారికి మిత్తితో సహా చెల్లిస్తాం. రేషన్ దుకాణాల బాధితుల తరపున హైకోర్టును ఆశ్రయిస్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | సిరిసిల్లను మరో తిర్పూర్ చేయాలని సంకల్పించాం.. కానీ ఈ పిచ్చోడికి అర్థం కాదు : కేటీఆర్
KTR | నా మీద కోపంతో.. నేతన్నల మీద కక్ష తీర్చుకుంటున్నాడు.. రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
KTR | అమ్మమ్మ – తాతయ్యల జ్ఞాపకార్థం బడి కట్టించా.. గుడిని కూడా కట్టిస్తా : కేటీఆర్