KTR | హైదరాబాద్ : ఒక్క కాకికి కష్టం వస్తే పది కాకుల ఎలాగైతే వాలిపోతాయో.. అలాగే ఒక్క కార్మికుడికి కష్టం వస్తే అందరూ కలిసి ఉద్యమించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. రేవంత్ రెడ్డికి చుక్కలు చూపించాలని కార్మికులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్మిక విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు.
ఇవాళ ఆవిష్కరించుకున్న క్యాలెండర్ తేదీలు మారే క్యాలెండర్‌గా ఉండిపోకూడదు.. పోరాటాలు చేసే క్యాలెండర్ కావాలి ఇది. ఆటో డ్రైవర్లకు హామీలు ఇచ్చిండు.. కానీ అమలు చేయడం లేదు. ఇవాళ ఆటో డ్రైవర్లు ఓఆర్ఆర్ బయట ఉండాలని అంటుండు. ఆటో వాళ్లకు బతుకుదెవురు లేకుండా చేస్తుండు. మే 1వ తేదీ లోపు 15 రోజులకు ఒక ప్రోగ్రాం తీసుకోవాలి. గిగ్ వర్కర్స్‌తో మీటింగ్ పెట్టాలి. ఆటో డ్రైవర్లు, గిగ్ వర్కర్లకు బడ్జెట్ పెట్టే విధంగా పోరాటం చేయాలి. కార్మిక దినోత్సవం రోజు వరకు అమలు కావాలి. కాకి కష్టం వస్తే.. అన్ని కాకులు గుమిగూడినట్లు మీరు ఏకం కావాలి. ఒక కార్మికుడికి కష్టం వస్తే అందరం కలిసి ఉద్యమించాలి. హైదరాబాద్ నగరంతో పాటు మిగతా జిల్లాల్లో కొత్త కమిటీలు వేసుకోవాలి. పోరాట పటిమ ఉన్నోళ్లు, రేవంత్ రెడ్డికి చుక్కలు చూపించే వాళ్లు రావాలి. ఎవరి మీద ఎక్కువ కేసులు అయితే వారు పెద్ద నాయకులు అవుతారు. పోయింది అధికారం మాత్రమే పోరాట పటిమ కాదు. 420 హామీలను అమలు చేసే దాకా వెంబడపడుదాం.. ఎవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్ తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి..
KTR | లక్షా 40 వేల కోట్లు అప్పు చేసి ఏం పీకినవ్ రేవంత్..? సూటిగా ప్రశ్నించిన కేటీఆర్
KTR | సఫాయి అన్న.. నీకు సలాం అన్న సీఎం ఈ దేశంలో ఎవరూ లేరు.. కేవలం కేసీఆర్ మాత్రమే : కేటీఆర్
KTR | కష్టం వచ్చినప్పుడే నాయకుడి విలువ తెలుస్తది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు