Harish Rao | హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఇప్పటికీ చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని, రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయని హరీశ్‌రావు తెలిపారు. గాంధీ భవన్ వద్ద ధర్నాకు దిగిన రైతు విషయంలో హరీశ్‌రావు స్పందించారు.
అందరికీ రుణమాఫీ చేసినట్లు అందమైన కట్టుకథను ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. మిమ్మల్ని నిలదీసేందుకు తుంగతుర్తి నుంచి గాంధీ భవన్ దాకా వచ్చిన రైతు తోట యాదగిరి గారికి ఏం సమాధానం చెబుతారు అని హరీశ్‌రావు నిలదీశారు. మీరిచ్చిన ఆరు గ్యారెంటీలు ఎన్నికల గారడీనేనని, 420 హామీల అమలు వట్టి బూటకమేనని తెలంగాణ ప్రజలు తక్కువ సమయంలోనే తెలుసుకున్నరు. మిమ్మల్ని నిలదీసేందుకు ఒక్కొక్కరిగా గాంధీ భవన్‌కు చేరకముందే పాపపరిహారం చేసుకోండి. రైతులు, మహిళలకు, విద్యార్థులకు, వృద్ధులకు, ఉద్యోగులకు.. అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి అని రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సూచించారు.
ఈరోజు గాంధీ భవన్ దాకా వచ్చిన వారు, రేపో మాపో మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ దాక వస్తరు. ప్యాలెస్ పాలన వదిలి ప్రజా పాలన కొనసాగించు. ఏడు పదుల వయస్సులో రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగిండు, అధికారులను వేడుకున్నడు. అయినా వెనకడుగు వేయకుండా గాంధీ భవన్ దాకా వచ్చి పోరాటం చేస్తున్న రైతు యాదగిరి పట్టుదలకు అభినందనలు. ఇదే స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని, హామీలు అమలు చేసే దాకా కొట్లాడాలని బీఆర్ఎస్ పక్షాన పిలుపునిస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
అందరికీ రుణమాఫీ చేసినట్లు అందమైన కట్టుకథను ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి @revanth_anumula గారూ..మిమ్మల్ని నిలదీసేందుకు తుంగతుర్తి నుంచి గాంధీ భవన్ దాకా వచ్చిన రైతు తోట యాదగిరి గారికి ఏం సమాధానం చెబుతారు.
మీరిచ్చిన ఆరు గ్యారెంటీలు ఎన్నికల గారడీనేనని, 420 హామీల అమలు వట్టి… pic.twitter.com/gUU5PrsqMr
— Harish Rao Thanneeru (@BRSHarish) February 21, 2025
ఇవి కూడా చదవండి..
Congress Party | సీఎం రేవంత్ రెడ్డికి భారీ షాక్.. కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై
Gandhi Bhavan | రుణమాఫీ కాలేదంటూ.. గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా.. వీడియో
Jagadish Reddy | ఏపీ నీటి దోపిడీతో.. తెలంగాణలో సాగు, తాగు నీళ్లకు కటకట: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి