RS Praveen Kumar | హైదరాబాద్ : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. దశాబ్దాలుగా వెనకకు నెట్టివేయబడ్డ ఎన్నో పేద కులాలకు ఈ చరిత్రాత్మక తీర్పు వల్ల ఇప్పుడైనా కొంత న్యాయం జరుగుతుందని ఆశిద్దాం అని ఆయన పేర్కొన్నారు.
అయితే ప్రభుత్వ రంగంలో అవకాశాలు సన్నగిల్లుతున్న ఈ తరుణంలో ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లను ప్రవేశపెడితేనే పేద వర్గాల సంపూర్ణ అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. దక్షిణ భారత దేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయాన్ని తెరమీదికి తీసుకొచ్చి మూడు దశాబ్దాల పోరాటాన్ని నిర్మించిన కృష్ణ మాదిగకు, మిగతా ఉద్యమకారులందరికీ, ఈ అంశాన్ని సమర్థించిన అన్ని రాజకీయ పార్టీలకు అభినందనలు తెలుపుతున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ను స్వాగతిస్తున్న. దశాబ్దాలుగా వెనకకు నెట్టివేయబడ్డ ఎన్నో పేద కులాలకు ఈ చరిత్రాత్మక తీర్పు వల్ల ఇప్పుడైనా కొంత న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. అయితే ప్రభుత్వ రంగంలో అవకాశాలు సన్నగిల్లుతున్న ఈ తరుణంలో ప్రైవేటు రంగంలో కూడా…
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) August 1, 2024
ఇవి కూడా చదవండి..
KTR | ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: కేటీఆర్
CM Revanth Reddy | ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణ అమలు: సీఎం రేవంత్ రెడ్డి