TG Assembly | ఎస్సీ వర్గీకరణపై ‘సుప్రీం’ తీర్పును స్వాగతిస్తున్నాం.. మాదిగలకు ద్రోహం చేసింది కాంగ్రెస్సే : హరీశ్‌రావు
TG Assembly | ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్వాగతిస్తున్నామని.. హర్షం వ్యక్తం చేస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ శాసనసభలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై హరీశ్‌రావు మాట్లాడారు.
TG Assembly | ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్వాగతిస్తున్నామని.. హర్షం వ్యక్తం చేస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ శాసనసభలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై హరీశ్‌రావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్గీకరణపై తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సభా నాయకుడిగా కేసీఆర్ నవంబర్ 29, 2014లో వర్గీకరణ వెంటనే చేయాలని ఆ నాడు కేసీఆర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారన్నారు. కేంద్రానికి ఏకగ్రీవంగా వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేసిన పార్టీ బీఆర్ఎస్ అని.. తీర్మానం చేయడంతో పాటు ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలని తీర్మానం కాపీని స్వయంగా కేసీఆర్ తీసుకొని వెళ్లి ఆ నాటి ఉప ముఖ్యమంత్రులు, దళిత నాయకులతో కలిసి ప్రధానిని కలిసి అందజేశారని గుర్తు చేశారు.
అంతేకాకుండా వర్గీకరణ ప్రాధాన్యతను ప్రధానికి కేసీఆర్ వివరించారని.. ప్రధాని ఆ రోజు కూడా చాలా స్పష్టంగా ఇది న్యాయమైన డిమాండ్ అనీ, దీన్ని తప్పకుండా పరిష్కరిస్తామని ఆ రోజు సానుకూలంగా స్పందించారన్నారు. అయితే, వర్గీకరణ పోరాటం సుదీర్ఘమైందని.. ఎన్నో త్యాగాలు జరిగాయన్నారు. ఎంతో మంది ప్రాణాలు అర్పించిన సంగతి మనకు తెలుసునన్నారు. ఇదే గాంధీ భవన్ దగ్గర పెట్రోల్ పోసుకొని ఆ రోజు కొందరు మాదిగలు ఆత్మాహుతికి పాల్పడితే.. అప్పటి ప్రభుత్వం కనీసం వాళ్లను పట్టించుకున్న పాపానపోలేదని మండిపడ్డారు. కానీ, ఆ మాదిగలకు కేసీఆర్.. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వారందరికీ ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న పార్టీ బీఆర్ఎస్, నాయకుడు కేసీఆర్ అని తెలిపారు.
ఆ నాడు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని.. వర్గీకరణ చేయడం లేదని మందకృష్ణ మాదిగ నేతృత్వంలోని గాంధీ భవన్ వద్ద పెద్ద ఎత్తున మాదిగలు ముట్టడికి వచ్చి పోరాటం చేసేందుకు వచ్చిన విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలని హితవు పలికారు. ఆ రోజు అమరులైన కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం ఆదుకున్నది తప్ప గతంలో ఉన్న కాంగ్రెస్ పట్టించుకోకుండా అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అంటూ ధ్వతజమెత్తారు. ఏదిఏమైనా ఈ సందర్భం చాలా సంతోషమైన సందర్భమన్నారు. దశబ్దాలా కల నెరవేరినటువంటి రోజని.. దాంతోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. అలాగే, ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతును తెలుపుతున్నాం. కానీ, నిన్న ఇవాళ సభ జరిగిన తీరు మా హృదయాలను గాయపరిచిందన్నారు. మహిళా శాసనసభ్యులను అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also :
-
KTR | ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: కేటీఆర్
-
Manda Krishna Madiga | 20 ఏండ్ల పోరాటానికి దక్కిన ఫలితం: మంద కృష్ణ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

