RS Praveen Kumar | హైదరాబాద్ : సూర్యాపేట జిల్లాలోని బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని విద్యార్థినులు గత నాలుగైదు రోజుల నుంచి డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి సూర్యాపేట కలెక్టరేట్ వద్ద దాదాపు 200 మంది విద్యార్థినులు ధర్నాకు దిగారు. ఈ అమ్మాయిల నిరసనలకు బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఈ బిడ్డలకు నిజంగా ఎంత కష్టమున్నదో! సాధారణంగా ఏదైనా భరించలేనిదిగా మారినప్పుడే అమ్మాయిలు రోడ్డు మీదికొచ్చి ధర్నాలు చేస్తారు. నిన్న రాత్రి సూర్యాపేట కలెక్టరేట్ ఎదురుగా వందల మంది డిగ్రీ కళాశాల అమ్మాయిలు ప్రిన్సిపాల్‌ను బదిలీ చేయాలని ధర్నాకు కూర్చున్నరు. పాపం అన్నం తిన్నరో లేదో? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
వాళ్ల నిరసన పాటలతో శాంతియుతంగా సాగింది. తరతరాలుగా బహుజనులు ఈ ఆవేదనాభరిత గీతాలు పాడుతూనే ఉన్నరు. ఈ పరంపరకు అంతం లేదా? ఈ ఆందోళనలు ఆగవా? ఎన్నడు వీళ్లు ఆనందంగా బతికేది? ఎన్నడు వీళ్లు ఎర్ర బస్సుల నుండి ఎయిర్ బస్సుల నెక్కేది? ఎన్నడు రూపాయల నుండి డాలర్లను సంపాదించేది? ఎన్నడు దినసరి కూలీలనుండి వీళ్లు కాంట్రాక్టర్లయితరా? గుడిసెల నుండి గేటెడ్ కమ్యూనిటీలలో బతికే అవకాశం వీళ్లకొస్తదా? ఈ ప్రభుత్వంలో ఎవరైనా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? సంక్షేమ శాఖామంత్రి గారు, తమరెక్కడ? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.
ఈ బిడ్డలకు నిజంగా ఎంత కష్టమున్నదో! సాధారణంగా అది భరించలేనిది గా మారినప్పుడే అమ్మాయిలు రోడ్డు మీదికొచ్చి ధర్నాలు చేస్తరు.
నిన్న రాత్రి సూర్యాపేట కలెక్టరేట్ ఎదురుగా వందల మంది డిగ్రీ కళాశాల అమ్మాయిలు ప్రిన్సిపాల్ ను బదిలీ చేయాలని ధర్నాకు కూర్చున్నరు. పాపం అన్నం తిన్నరో లేదో?వాళ్ల… pic.twitter.com/MgnEP62f1b
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) July 11, 2024
ఇవి కూడా చదవండి..
KTR | ఈ మహా నగరానికి ఏమైంది..?.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఫైర్
MP Shivani Raja: బ్రిటన్ పార్లమెంట్లో.. భగవద్గీతపై ప్రమాణం చేసిన ఎంపీ శివానీ.. వీడియో