KTR | ఈ మహా నగరానికి ఏమైంది..?.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఫైర్
KTR | ఈ మహానగరానికి ఏమైంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ప్రముఖ పత్రికలు కూడా “ఈ నగరానికి ఏమైంది?" అని ఫ్రంట్ పేజిలో వార్తలు రాస్తోంది అంటే నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని అర్థమని వివరించారు. పరిపాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాద్ నుంచి తెలంగాణ పల్లెటూరు వరకూ అంతటా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
KTR | ఈ మహానగరానికి ఏమైంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ప్రముఖ పత్రికలు కూడా “ఈ నగరానికి ఏమైంది?” అని ఫ్రంట్ పేజిలో వార్తలు రాస్తోంది అంటే నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని అర్థమని వివరించారు. పరిపాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాద్ నుంచి తెలంగాణ పల్లెటూరు వరకూ అంతటా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
“బ్రాండ్ హైదరాబాద్” ఎందుకు మసకబారుతోంది ?? విశ్వనగరంగా ఎదుగుతున్న వేళ.. ఎందుకింత కళ కోల్పోతోంది ?? అని సగటు హైదరాబాదీకి అనిపిస్తుందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ను ప్రేమించే ప్రతిఒక్కరిలో ఇదే ఆవేదన ఉందని తెలిపారు. పదేళ్లు ప్రశాంతంగా ఉన్న నగరంలో వరుస హత్యలు.. పేట్రేగిపోతున్న అంతరాష్ట్ర ముఠాలు పెరిగిపోతున్నాయని అన్నారు.
రాజధాని హైదరాబాద్‌లో శాంతి లేదని.. నగర ప్రజల జీవితాలకు భద్రత లేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం గారు స్వయంగా…
పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తున్నా.. పోలీసింగ్‌పై కమాండ్ ఏది అని ప్రశ్నించారు. క్షీణిస్తున్న శాంతిభద్రతలపై కంట్రోల్ ఏది అని నిలదీశారు. ఓవైపు.. కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం.. పరిపాలనా వైఫల్యాన్ని వేలెత్తి చూపుతోందని తెలిపారు. మరోవైపు.. పడగవిప్పిన హత్యల సంస్కృతి.. ప్రతి కుటుంబంలో వణుకు పుట్టిస్తోందన్నారు. ఇంకోవైపు.. తరలిపోతున్న పెట్టుబడుల పర్వం.. యువత ఉపాధి అవకాశాల్ని దెబ్బతీస్తోందని చెప్పారు.
కాంగ్రెస్ పవర్ లోకి రాగానే గడియ గడియకు ఏమిటీ.. పవర్ కట్ అని కేటీఆర్ ప్రశ్నించారు. సేఫ్ సిటీగా ఉన్న మహానగరంలో క్రైమ్ రేట్ ఎందుకు పెరిగిపోతుందని నిలదీశారు. ఇదేనా మీరు తెస్తానన్న మార్పు అని మండిపడ్డారు. విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి.. పదేళ్లు కష్టపడి పునాదులు వేస్తే.. అధికారంలోకి రాగానే ఆగం చేస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంతో పోటీపడే నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ ప్రగతికి అర్ధాంతరంగా బ్రేకులు వేస్తే ఎలా ?? దేశ రాజధాని చుట్టూ.. రాజకీయ చక్కర్లు కొట్టడంపై ఉన్న శ్రద్ధ.. చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర రాజధానిపై లేకపోతే ఎలా ?? అని మండిపడ్డారు.
హైదరాబాద్ అంటే.. కేవలం రాజధాని కాదు..”తెలంగాణ ఎకనమిక్ ఇంజన్ ” అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇకనైనా.. కాంగ్రెస్ సర్కారు మేల్కొనకపోతే.. మన హైదరాబాద్ దెబ్బతింటే.. రాష్ట్రానికి కష్టమే కాదు.. యావత్ దేశానికి కూడా నష్టమని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Alert | మరో తుపాన్ ముప్పు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
Promotions Scam | నర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రమోషన్లలో వసూళ్ల దందా.. ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు?
Bharat Summit | కార్మికుల నెత్తురుతో.. సమ్మిట్ సోకులు.. భారత్ సమ్మిట్‌కు ఖర్చు చేసే సొమ్ములో మేజర్ వాటా కార్మిక సంక్షేమ బోర్డుదే!
Balmoor Venkat | ఎమ్మెల్సీ బల్మూరి బల ప్రయోగం.. 20 మంది ప్రాణాలు కాపాడిన బాండీ బీచ్ హీరోకు సొంత రాష్ట్రంలో కష్టాలు
Rythu Runa Mafi | రుణమాఫీకి కుంటిసాకులు.. అర్హత ఉన్నా రైతుకు అందని వైనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్



