RSP | హైదరాబాద్ : రామగుండంలో ట్రాఫిక్ ఏసీపీ జానీ నర్సింహులుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. నన్ను ఆపిన ఆ పాగల్ గాడు ఎవడు అంటూ.. ట్రాఫిక్ ఏసీపీని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ తిట్టారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.
రౌడీల – రేవంతుల రాజ్యంలో పాపం పోలీసులకే రక్షణ కరువైంది. తెలంగాణ డీజీపీ గారూ.. ఏసీపీ జానీ నర్సింహులు గారు మామూలు పోలీస్ అధికారి కాదు. అత్యంత ధైర్య సాహసాలు చూపించి ఎన్నో సార్లు డిపార్ట్మెంట్ పరువు కాపాడిన వ్యక్తి. సహచరుల రక్షణ కోసం ప్రాణ త్యాగానికి కూడా వెరవని ఖాకీ బుల్లెట్ అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
పాపం నర్సింహులు ఒక ఎస్సీ కావడం వల్ల యాక్సిలరేటెడ్ ప్రమోషన్ కూడా ఇవ్వలేదు ఈ డిపార్ట్మెంట్. ఫారిన్ మందు సీసాలు మోసిన కొంత మందికి మాత్రం దొడ్డిదారిన ఆక్సిలరేటెడ్ ప్రమోషన్లు వచ్చినయి. ఆ చిట్టా మళ్లెప్పుడైనా బయట పెడతా. అలాంటి నిజాయితీ గల నిప్పులాంటి ఆఫీసర్‌ను రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు పాగల్ గాడు అనడం ముమ్మాటికీ నేరమే అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
ఇది కాంగ్రెస్ రాజ్యం అంటూ చేతులతో నెట్టేసి ఏసీపీపై దాడికి దిగిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై కేసు నమోదు చేయండి. లేకపోతే వాళ్లే హోం మంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఏసీపీ మీదనే కేసు పెట్టమంటరు. జాగ్రత్త! రౌడీల పట్ల నిక్కచ్చిగా వ్యవహరించిన ఏసీపీ నర్సింహులుకు ప్రమోషన్ ఇచ్చి మంచి పోస్టింగ్ ఇవ్వండి. నిక్కచ్చిగా డ్యూటీ చేసిన ఏసీపీకే గొడవ వద్దంటూ సర్దిచెప్పిన తోటి పోలీసు అధికారులను అర్జంటుగా సస్పెండ్ చేయండి. అలాంటి బలహీనులకు డిపార్ట్మెంట్లో స్థానం ఉండకూడదు అని ఆర్ఎస్పీ హెచ్చరించారు.
కొంచెం ఆ జానీ నర్సింహులును చూసి ధైర్యం తెచ్చుకోండి తెలంగాణ పోలీసు అన్నలారా, చెల్లెలారా. నిజాయితీగా చట్ట పరంగా డ్యూటీ చేస్తే ప్రజలు మిమ్ముల గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటరు. రేవంత్-మక్కాన్ లాంటి వారు కేవలం కాగితపు పులులే. వాళ్లకు తెలంగాణ కోర్టులో శిక్ష తప్పదు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Suryapeta | నానమ్మ కళ్లలో ఆనందం కోసమే నా భర్త హత్య.. భార్గవి సంచలన వ్యాఖ్యలు..!