Metuku Anand | హైదరాబాద్ : అనంతగిరి అడవులను రూ. 1000 కోట్లకు మేఘా కృష్ణారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ధారాదత్తం చేశారని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మెతుకు ఆనంద్ మీడియాతో మాట్లాడారు.
మేఘా కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చిన రేవంత్ రెడ్డి అదే సంస్థతో ఎందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు..? మేఘా అనేది ఇంజినీరింగ్ సంస్థ. వెల్ నెస్ సెంటర్ ఏర్పాటుకు మేఘాతో ఒప్పందం ఎలా కుదుర్చుకుంటున్నారు..? అనంతగిరి అడవులను అప్పగించే ప్రయత్నంపై త్వరలోనే ప్రజా మద్దతుతో ఉద్యమం ప్రారంభిస్తాం అని మెతుకు ఆనంద్ స్పష్టం చేశారు.
వికారాబాద్ రోడ్లను బాగు చేయని సీఎం లక్ష కోట్లు పెట్టుబడులు తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నారు. సీఎం రేవంత్‌కు టీబీ ఏమిటో, లెప్రసి ఏమిటో కూడా తెలియడం లేదు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో మోసాలు జరుగుతున్నాయి. బేస్మెంట్ వరకు కట్టుకుంటే డబ్బులు ఇస్తామంటున్నారు.. ఎస్సీ, ఎస్టీల దగ్గర డబ్బులు ఎక్కడివి..? అన్ని పథకాల్లో మోసమే జరుగుతోంది. తూతూ మంత్రంగా మండలానికో గ్రామంలో పథకాలు ప్రారంభించారు. మునిసిపల్ వార్డుల్లో ఎక్కడా పథకాలు ప్రారంభం కాలేదు. ఉపాధి హామీ కార్డుతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు లింక్ పెట్టడం ఏమిటీ..? జాబ్ కార్డుతో సంబంధం లేకుండా భూమి లేని కూలీలు అందరికీ రూ. 12 వేల చొప్పున ఇవ్వాలి. రేవంత్ ప్రజలకు ఇచ్చేది తక్కువ ఎగ్గొట్టేది ఎక్కువ అని పథకాలను చూస్తే అర్థమవుతుంది. పథకాలకు అర్హులు కావాలంటే ప్రజలు భూములు అమ్ముకునే పరిస్థితిని రేవంత్ రెడ్డి తెచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు కాంగ్రెస్ నాయకులను గ్రామాలకు రానివ్వొద్దు అని మెతుకు ఆనంద్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
MLC Elections | పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
Suryapeta | నానమ్మ కళ్లలో ఆనందం కోసమే నా భర్త హత్య.. భార్గవి సంచలన వ్యాఖ్యలు..!