RS Praveen Kumar | హైదరాబాద్ : అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ధ్వజమెత్తారు. సీఎం తన పట్ల మాట్లాడిన మాటలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆర్ఎస్పీ ఎక్స్ వేదికగా స్పందించారు.
రేవంత్ రెడ్డి గారూ.. మీరు ఈ రోజు కొందుర్గులో మాట్లాడిన మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. కేసీఆర్ గారు ఎస్సీ, ఎస్టీలను గొర్రెలకు బర్రెలకు పరిమితం చేసిండ్రని మీరు నింద వేయడం గురించి రేపు అన్ని వివరాలతో మీడియాతో మాట్లాడుతా గాని,
ముందు మీ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల నుండి ముగ్గురు సాఫ్ట్ బాల్ క్రీడాకారులు తైవాన్ ఇంటర్నేషనల్ టోర్నీకి సెలక్టు అయిండ్రంట, వాళ్ల చార్జీలకు ఐదు లక్షల రూపాయలు కూడా ఇస్తలేరంట మీ అధికారులు..! ఆ పిల్లలు ఇక గొర్రెలు బర్రెలు కాయకపోతే ఏం చేస్తరు??? కేసీఆర్ గారి టైంలో అయితే ఇలాంటి ప్రతిభావంతులైన బిడ్డలకు క్షణాల్లో లక్షల్లో డబ్బులు పడేవి. దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వివరణ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి గారు,
మీరు ఈ రోజు కొందుర్గులో మాట్లాడిన మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. కేసీఆర్ గారు ఎస్సీ, ఎస్టీలను గొర్రెలకు బర్రెలకు పరిమితం చేసిండ్రని మీరు నింద వేయడం గురించి రేపు అన్ని వివరాలతో మీడియాతో మాట్లాడ్త గాని,
ముందు మీ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల నుండి ముగ్గురు…— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 11, 2024
ఇవి కూడా చదవండి..
Job Notification | ఆరోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
KCR | తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరా పండుగకు ప్రత్యేక స్థానం : కేసీఆర్
SC Reservations | తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు..