Job Notification | హైదరాబాద్ : రాష్ట్ర ఆరోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 272 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్ట్ పోస్టులకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ను విడుదల చేసింది. గత నెలలో 2050 నర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఆ 2050 పోస్టులకు అదనంగా 272 పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 2322 నర్సింగ్ ఆఫీసర్లు, ఫార్మాసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులకు ఈ నెల 14 తుది గడువు. నవంబర్ 17న ఆన్లైన్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి..
TG Rains | ఉపరితల ద్రోణి ప్రభావం.. మరో మూడురోజులు వానలే..!
Mohammed Siraj | హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్కు డీఎస్పీ పోస్టు