KCR | హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని చెడు మీద నిత్యం పోరాటం చేస్తూ మంచి దిశగా విజయం సాధించాలనే జీవన తాత్వికతను విజయ దశమి మనకు తెలియజేస్తుందని పేర్కొన్నారు.
దసరా రోజు శుభసూచకంగా పాలపిట్టను దర్శించి షమీ వృక్షానికి పూజ చేసి, జమ్మి ఆకును బంగారంలా భావించి పెద్దలకు సమర్పించుకుని వారి ఆశీర్వాదం తీసుకోవడం ఆచారం. తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరా పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. అలాయ్ బలాయ్ తీసుకుని పరస్పర ప్రేమాభిమానాలను పంచుకోవడం ద్వారా దసరా పండుగ సందర్భంగా ప్రజల నడుమ సామాజిక సామరస్యం ఫరిడవిల్లుతుంది అని కేసీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
SC Reservations | తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు..
Telangana | సమగ్ర కులగణనపై తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు
Job Notification | ఆరోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల