బాన్సువాడ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలోని ఓ పోలింగ్ కేంద్రం దగ్గర బీఆర్ఎస్ ఏజెంట్ శ్రీనివాస్ గౌడ్‌ను పోలీసులు దౌర్జన్యంగా బయటికి ఈడ్చుకెళ్లారు.
బాన్సువాడ మున్సిపాలిటీలో ఓ కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను ప్రలోభపెట్టారు. బాన్సువాడ మున్సిపాలిటీ 9వ వార్డులో బందోబస్తు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్.. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఓటర్లకు చెబుతుండగా అక్కడే ఉన్న బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నిలదీశారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.