Canada School Shooting: స్కూల్లో కాల్పులకు తెగబడ్డ మహిళా షూటర్.. కెనడాలో 10 మంది మృతి, 25 మందికి గాయాలు
Canada School Shooting: కెనడాలోని ఓ స్కూల్లో కాల్పుల ఘటన జరిగింది. ఓ మహిళా షూటర్ ఫైరింగ్‌కు పాల్పడింది. నిందితురాలితో సహా మొత్తం 10 మంది మృతిచెందారు. మరో 25 మంది గాయపడ్డారు.
ఒట్టావా: కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో కాల్పుల(Canada School Shooting) ఘటన జరిగింది. ఆ కాల్పుల్లో 10 మంది మృతిచెందారు. మరో 25 మంది గాయపడ్డారు. కాల్పులకు తెగించిన వ్యక్తిని ఓ మహిళగా గుర్తించారు. ఆమెకు బ్రౌన్ కలర్ జట్టు ఉన్నట్లు రాయల్ కెనిడియన్ మౌంటెడ్ పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిపిన తర్వాత స్కూల్ పరిసరాల్లోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
స్కూల్లోనే ఆరుగురి మృతదేహాలను గుర్తించారు. ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి మరణించాడు. ఆ స్కూల్ కమ్యూనిటీ వద్ద ఉన్న ఓ ఇంట్లో మరో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్లో కాల్పుల ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఫైరింగ్ ఘటనలో రెండో షూటర్ ఉన్నారేమో అన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేశారు. బాధితుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్నారు.
టంబ్లర్ బ్రిడ్జ్ పట్టణంలో సుమారు 2500 మంది జనాభా ఉంటారు. అయితే ఈ ఘటన నేపథ్యంలో అక్కడ భద్రతను పెంచారు. స్కూల్‌ను వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఘటన జరిగిన సమయంలో స్కూల్లో సుమారు వంది మంది ఉన్నారు. వారిలో విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు. అయితే వాళ్లందర్నీ సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.
ఏ కారణం చేత ఆ మహిళా షూటర్ ఇంత దారుణానికి పాల్పడిందో అర్థం కావడం లేదని పోలీసులు చెబుతున్నారు. కాల్పులు జరుగుతున్న సమయంలో కొందరు విద్యార్థులు ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేశారు. టంబ్లర్ బ్రిడ్జ్‌లో జరిగిన షూటింగ్ ఘటన తమను కలిచివేసినట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నే తెలిపారు.
టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్లో సుమారు 175 మంది విద్యార్థులు ఉన్నట్లు ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా తెలిసింది. వారంతా 7 నుంచి 12వ గ్రేడ్ విద్యార్థులు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

