వరంగల్ : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి చిన్న విషయానికి ప్రతిపక్షాల నేతలను ముందుస్తుగా అరెస్ట్ చేయడం పరిపాటిగా మారింది. తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేటలో(Narsampet) మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ పర్యటించి జిల్లా జనరల్ హాస్పిటల్, ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రారంభించనున్నారు. కాగా, మంత్రులను అడ్డుకుంటారనే నెపంతో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని( Peddi Sudarshan Reddy) పోలీసులు హౌస్ అరెస్ట్(House arrest) చేశారు.
కాగా, తెలంగాణ ఉద్యమ నాయకుడు నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో పాటుపడిన సుదర్శన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అన్యాయమని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇలాంటి అరెస్ట్‌లతో ప్రశ్నించే గొంతులను అడ్డుకోలేరన్నారు. అందరినికి కలుపుకొని చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఇలా దొంగచాటుగా చేయడమేంటని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి హౌస్ అరెస్ట్
నర్సంపేటలో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ
మంత్రులను అడ్డుకుంటారనే నెపంతో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/GkyZbsdubR
— Telugu Scribe (@TeluguScribe) September 19, 2024
Jani Master | జానీ మాస్టర్ కోసం గాలింపు.. బాధితురాలి ఇంటికి పోలీసులు..!
Jani Master | ఇది లవ్ జిహాద్ కేసు.. జానీ మాస్టర్ కేసుపై కరాటే కళ్యాణి
Vetrimaaran | వెట్రిమారన్ విడుదల పార్ట్ 2 షూట్ టైం.. ఏ సీన్లు చిత్రీకరిస్తున్నారో తెలుసా..?