Dasoju Sravan | హైదరాబాద్ : రేవంత్ రెడ్డికి రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత కూడా అగ్రవర్ణ అహంకారం పూర్తిగా పోయినట్లు లేదు అని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా వేమన పద్యాన్ని దాసోజు శ్రవణ్ గుర్తు చేశారు.
ఆత్మశుద్ధిలేని యాచార మదియేల?
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా?
విశ్వదాభిరామ వినురవేమ! అన్నట్లు అగ్రకుల అహంకారం ఉన్న రేవంత్ రెడ్డికి కులగణనపై స్వతహాగా చిత్తశుద్ధి లేదనేది చెప్పకనే చెప్పిండు అని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
కేవలం రాహుల్ గాంధీ చెప్పారు కాబట్టి నేను కుల గణన చేస్తున్నాను అనడం ఆయన అగ్రకుల ఆధిపత్య అహంకారానికి నిదర్శనం. బీసీల అభ్యున్నతి పట్ల తనకు బాధ్యత లేనట్లు మాట్లాడటం నమ్మకద్రోహం సామాజిక నేరం, రాజ్యాంగ ఉల్లంఘన. ఇంతటి వివక్షపూరిత కుల ఆధిపత్య మనస్తత్వం ఉన్న రేవంత్ రెడ్డి రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి అనర్హుడు. మరీ ముఖ్యంగా కుల గణన నిర్వహించడానికి ఏమాత్రం నైతికత లేదు, అర్హత అసలే లేదు. ఇంత ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న పెద్దమనిషి కులగణన చేయడు, అణగదొక్కబడ్డ బీసీలకు న్యాయం చేయడు. పారా హుషార్ అని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
“ఆత్మశుద్ధిలేని యాచార మదియేల?
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా? విశ్వదాభిరామ వినురవేమ” అన్నట్లు అగ్రకుల అహంకారం ఉన్న శ్రీ రేవంత్ రెడ్డికి కులగణన పై స్వతహాగా చిత్తశుద్ధి లేదనేది చెప్పకనే చెప్పిండు @Revanth_anumulaకేవలం రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు కాబట్టి… pic.twitter.com/TbPjC1t4WS
— Prof Dasoju Sravan Kumar (@sravandasoju) November 6, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ చేతలు గడప దాటడం లేదు : హరీశ్ రావు
Health Tips | ఊబకాయంతో విసిగిపోతున్నారా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
MS Dhoni – Trump | అమెరికా అధ్యక్షుడితో గోల్ఫ్.. ధోనీ వీడియో వైరల్