Peddi Sudarshan Reddy | నర్సంపేట : తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం తగదని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి వరంగల్ జిల్లా నర్సంపేటలోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయకుండా అడ్డుకున్నందుకు నిరసనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు,ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,ఎమ్మెల్యేలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి పాలిస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందారని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం ఎందుకన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
DDMS | డీడీఎంఎస్‌లో వివిధ వొకేషనల్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
KTR | లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేదాకా పోరాటం చేస్తాం : కేటీఆర్
KCR | 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. కేసీఆర్‌కు ఆహ్వానం