వనపర్తి : నిరు పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి నివాసంలో లబ్ధిదారులకు రూ.28.59 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి సహయనిధి ఆపదలో ఉన్న వర్గాలకు ఎంతో ప్రయోజనకరమన్నారు.
సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తుస్తున్నారని తెలిపారు. సబ్బండ వర్ణాలకు అనేక పథకాలను అమలు చేస్తూ తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సహఫక్తి భోజనాలు చేశారు.
ఇవి కూడా చదవండి..
Crime news | గద్వాలలో ఆర్ధరాత్రి దొంగల హల్చల్
Crime news : ట్రాక్టర్ బోల్తా..ఇద్దరికి తీవ్ర గాయాలు
Road accident | బైక్ను ఢీ కొట్టిన బస్సు..ఇద్దరి దుర్మరణం