కొత్తపల్లి ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
CM KCR | గద్వాల జిల్లా కొత్తపల్లిలో గోడ కూలి ఐదుగురు మృతిచెందిన ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్‌రెడ్డికి ఫోన్ చేసి ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.

హైదరాబాద్: గద్వాల జిల్లా కొత్తపల్లిలో గోడ కూలి ఐదుగురు మృతిచెందిన ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్‌రెడ్డికి ఫోన్ చేసి ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. మృతులు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని ఆదేశించారు. మృతుల కుంటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. కుటుంబంలో మిగతా వారికి ప్రభుత్వపరంగా విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్ల నిర్మాణాలను అధికారులు గుర్తించాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
కాగా, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి నిరంజన్‌రెడ్డి మృతులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబానికి సంతాపం తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని కొత్తపల్లిలో ఆదివారం తెల్లవారుజామున గోడ కూలడంతో ఐదుగురు మృతిచెందారు. కొత్తపల్లికి చెందిన మోష శనివారం రాత్రి తన భార్య, ఐదుగురు పిల్లలతో ఇంట్లో నిద్రిస్తుండగా.. వర్షానికి గుడిసె గోడ కూలింది. దీంతో భార్యాభర్తలతోపాటు ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

