Yadagirigutta | యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలంలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. పెద్దకందుకూరులో ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ పరిశ్రమలో సంభవించిన పేలుడు ధాటికి 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ కార్మికుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
ఎమర్జెన్సీ సైరన్‌తో పరిశ్రమ యాజమాన్యం కార్మికులను అప్రమత్తం చేసింది. దీంతో భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. అయినప్పటికీ 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
KTR | అక్షరం మార్పు కోసం అక్షరాల 1000 కోట్ల ఖర్చా..? రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
Cold Wave | తెలంగాణను వణికిస్తున్న చలి.. సంగారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు
KTR | ఎంత విషం చిమ్మినా.. తెలంగాణ దాహం తీరుస్తోంది మన కాళేశ్వరం : కేటీఆర్