భైంసా టౌన్, ఫిబ్రవరి 26 : అకాల వర్షానికి నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాం గ్రామంలో భైంసా-నిజామాబాద్ జాతీయ రహదారిపై రైతులు బైఠాయించారు. గంటపాటు రాస్తారోకో చేయడంతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్ మేర వా హనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతు లు మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం కురిసిన వడగండ్ల వానకు మక్కజొన్న తీవ్రంగా దెబ్బతిన్నదని తెలిపారు. నష్టం వివరాలను ఎవరూ సేకరించలేదని, కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలని డి మాండ్ చేశారు.
ఎకరాకు రూ.50 వేల చొ ప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. నిరుడు సిరాల ప్రాజెక్టు తెగిపోవడంతో దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కాళ్లు మొక్కు తం సహకరించాలని వేడుకున్నారు. నష్టపరిహారం అందించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తంచేశారు. తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఏవో గణేశ్, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై సుప్రియ అక్కడికి చేరుకొని రైతులను సముదాయించి ఆందోళన విరమింపజేశారు.