KTR | అక్షరం మార్పు కోసం అక్షరాల 1000 కోట్ల ఖర్చా..? రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న వృథా ఖర్చులపై కేటీఆర్ ధ్వజమెత్తారు.
KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న వృథా ఖర్చులపై కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలనే లక్ష్యంతో పేర్లను మార్చుతూ.. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
2014లో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్ర పేరును టీఎస్(తెలంగాణ స్టేట్)గా మార్చిన విషయం తెలిసిందే. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. టీఎస్‌ను టీజీగా మార్చేసింది. అయితే ఒక్క అక్షరం మార్పు కోసం అక్షరాల రూ. 1000 కోట్ల ఖర్చా..? అంటూ రేవంత్ రెడ్డి సర్కార్‌పై కేటీఆర్ ధ్వజమెత్తారు.
రైతు భరోసా ఇచ్చింది లేదు.. రుణమాఫీ సక్కగా చేసింది లేదు.. పెన్షన్ పెంచింది లేదు.. ఆరు గ్యారెంటీల అమలుకు దిక్కులేదు.. కానీ.. ఆగమేఘాల మీద అనవసరమైన వాటి కోసం వేల కోట్ల ఖర్చు పెట్టేందుకు మనసొచ్చిందా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు.
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు.. ఒక్క అక్షరం మార్పు కోసం అక్షరాల 1000 కోట్ల ఖర్చా? వెయ్యి కోట్లు కాదు లక్ష కోట్లు ఖర్చుపెట్టినా.. తెలంగాణ అస్థిత్వాన్ని చెరపలేవు.. నాలుగు కోట్ల గుండెలపై కేసీఆర్ చేసిన సంతకాన్ని మార్చలేవు.. అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ తేల్చిచెప్పారు.
Hello @RahulGandhi ji,
Rs 1000 crore- the cost of one inflated ego!
Rs 1000 crore- the cost of One Letter
50,000 farmers could have had 2 lakh rupees wavier!
40 lakh women could have received the promised Rs 2,500
25 lakh old people could have received the promised Rs… pic.twitter.com/K4AT3OcBDW
— KTR (@KTRBRS) January 4, 2025
ఇవి కూడా చదవండి..
KTR | ఎంత విషం చిమ్మినా.. తెలంగాణ దాహం తీరుస్తోంది మన కాళేశ్వరం : కేటీఆర్
Shamshabad | శంషాబాద్‌లో విశాఖ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
Cold Wave | తెలంగాణను వణికిస్తున్న చలి.. సంగారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Congress govt
- KCR
- KTR
- Revanth Reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

