నేటి నుంచి బీకేఎస్ జాతీయ మహాసభలు
ఘట్కేసర్ మండలం అన్నోజిగూడ ఆర్వీకే పాఠశాల ప్రాంగణంలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి మార్చి 1వరకు అఖిల భారత సభలు జరుగనున్నాయని బీకేఎస్ నేత, సీసీఎంబీ విశ్రాంత ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ ఏవీరావు తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ఘట్కేసర్ మండలం అన్నోజిగూడ ఆర్వీకే పాఠశాల ప్రాంగణంలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి మార్చి 1వరకు అఖిల భారత సభలు జరుగనున్నాయని బీకేఎస్ నేత, సీసీఎంబీ విశ్రాంత ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ ఏవీరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మూడ్రోజులపాటు జరుగనున్న ఈ సదస్సును భారతీయ కిసాన్‌సంఘ్ అధ్యక్షుడు కే సాయిరెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అఖిలభారత ప్రధాన కార్యదర్శి మోహిని మోహన్ మిశ్రా, కార్యదర్శి దినేశ్ కులకర్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ముదుగంటి శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు జోగినపల్లి శ్రీరంగారావు, ప్రధాన కార్యదర్శి అంబీర్ ఆనందరావు, కోశాధికారి లింగనోళ్ల మాణిక్యరెడ్డి తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. అదేవిధంగా దేశంలోని వివిధ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వెయ్యిమంది భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు కూడా మహాసభలకు హాజరవుతారని ఆయన తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

