Kishan Reddy : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఓటమితో ఢిల్లీకి పట్టిన పీడ విరగడైందని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. 12 ఏళ్లుగా డిల్లీకి పట్టిన కేజ్రివాల్ (Kejriwal) అనే గ్రహణం నేటితో వీడిపోయిందని వ్యాఖ్యానించారు. కేజ్రివాల్ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారని ఆయన విమర్శించారు. ప్రజల సొమ్ముతో కేజ్రీవాల్ సొంత పబ్లిసిటీ చేసుకున్నారని ఆరోపించారు. అహంకారం, గర్వంతో విర్రవీగితే ఓటమి తప్పదని కేజ్రీవాల్, మనీష్ సిసోడియాల ఓటమితో మరోసారి రుజువైందని అన్నారు.
ప్రధాని మోదీ మీద విశ్వాసంతోనే ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని కిషన్‌రెడ్డి అన్నారు. అన్నీ ఫ్రీగా ఇస్తామని చెప్పినా ప్రజలు కేజ్రివాల్‌ను నమ్మలేదని చెప్పారు. బీజేపీ డబుల్ ఇంజిన్ పాలనలో ఢిల్లీ శరవేగంగా అభివృద్ధి చెందబోతున్నదని ఆయన అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే జాలేస్తున్నదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ఢిల్లీలో వరుసగా మూడోసారి డకౌట్ అయ్యిందని అన్నారు. రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరిగితే ఓట్లు రావని రాహుల్‌గాంధీని విమర్శించారు.
Parvesh Verma | ఢిల్లీలో జరిగిన అవినీతిపై సిట్ వేస్తాం.. కేజ్రివాల్‌పై గెలిచిన పర్వేష్ వర్మ వెల్లడి
Arvind Kejriwal | ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం.. బీజేపీకి అభినందనలు : అర్వింద్ కేజ్రీవాల్
Delhi Elections | సీఎం అతిషి విజయం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ పరాజయం
Delhi Elections | ఘోర పరాజయం పాలైన ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్
Delhli Elections | జంగ్‌పురా నియోజకవర్గంలో అనూహ్య ఫలితం.. ఆప్ నేత మనీశ్ సిసోడియా ఓటమి