యాదాద్రి భువనగిరి : భువనగిరి(Bhuvanagiri) సబ్ జైలు రిమాండ్ ఖైదీ భువనగిరి ప్రభుత్వ హాస్పిటల్ నుంచి పరారైన(Prisoner escaped) సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 17వ తేదీన భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసులో మహ్మద్ ఖాజా ఖాన్ అనే వ్యక్తిని జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా భువనగిరి సబ్ జైలుకు తరలించారు. 22వ తేదీన మెడికల్ చెక్ అప్ నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకువెళ్లిన సమయంలో పోలీసుల కళ్లు కప్పి పరారయ్యాడు. పరారైన ఖైదీ విషయం బయటకి రాకుండా జైలు సిబ్బంది జాగ్రత్తపడ్డట్లు సమాచారం. అనంతరం ఖైదీని పట్టుకొని సబ్ జైలుకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి వికృత రూపాన్ని చూసి ప్రజలు విస్తుపోతున్నారు : హరీశ్‌రావు
Sangareddy | ప్రియురాలి బంధువులు కొట్టారని మనస్తాపంతో ప్రియుడు ఆత్మహత్య?
అంత చిత్తశుద్ధి ఉంటే ఆ 10 మందితో రాజీనామా చేయించండి.. కూకట్పల్లి ఎమ్మెల్యే డిమాండ్