Telangana Police | తెలంగాణ పోలీసులు మంచి మనసు చాటుకున్నారు. పోలీసు అధికారి కావాలనే ఏడేళ్ల చిన్నారి కోరిక తీర్చారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆ చిన్నారిని పోలీసు అధికారి సీట్లో కూర్చోబెట్టి బాలుడి ముఖంలో సంతోషానికి కారణమయ్యారు.
గుంటూరుకు చెందిన మోహన్ సాయి గతేడాది క్యాన్సర్ బారిన పడ్డాడు. ప్రస్తుతం ఆ చిన్నారి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి (Cancer Hospital)లో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆ చిన్నారికి పోలీసు కావాలనే కోరిక ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది.. ‘మేక్ ఎ విష్’ ఫౌండేషన్ సభ్యులను సంప్రదించారు. వారి సహకారంతో చిన్నారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది మోహన్ సాయికి సాదరంగా స్వాగతం పలికి గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీస్ అధికారి సీట్లో కూర్చోబెట్టి పోలీసు స్టేషన్లో జరిగే పని విధానం గురించి వివరించారు. ఆ తర్వాత చిన్నారికి పలు బహుమతులను అందజేసి సంతోషపరిచారు.
Also Read..
Janhvi Kapoor | అందుకే అప్పుడు అమ్మను దూరం పెట్టా : జాన్వీ కపూర్
Chennai Rains | చెన్నైలో మరోసారి భారీ వర్షం.. తమిళనాడుకు ఐఎండీ రెయిన్ అలర్ట్
Security Heightened | భద్రతా వలయంలో పార్లమెంట్ భవనం.. డేగ కళ్లతో పహారా కాస్తున్న సిబ్బంది