Janhvi Kapoor | అందుకే అప్పుడు అమ్మను దూరం పెట్టా : జాన్వీ కపూర్
Janhvi Kapoor | కెరీర్ తొలినాళ్లలో శ్రీదేవి కూతురునన్న కారణంగా అభద్రతా భావనకు గురైనట్లు చెప్పుకొచ్చింది దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి (Sridevi) కూతురు జాన్వీకపూర్ (Janhvi Kapoor). అందువల్లనే తొలి సినిమా సమయంలో తన తల్లి సలహాలు, సూచనలు తీసుకోలేదని తెలిపింది.
Janhvi Kapoor | దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి (Sridevi) కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్ (Janhvi Kapoor). ధడక్ (Dhadak) సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే అగ్ర దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించింది. కెరీర్ తొలినాళ్లలోనే ఓ వైపు గ్లామరస్ పాత్రలు చేస్తూనే.. మరోవైపు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. రొమాంటిక్, కామిక్, హార్రర్, థ్రిల్లర్.. ఇలా అన్ని జోనర్లలో సినిమాలు చేస్తూ వెళ్తూ తల్లికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటోంది. బాలీవుడ్లో ఈ భామకు విజయాలు తక్కువే అయినా ఆమె పోషించిన పాత్రలకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. టాలీవుడ్ స్టార్ నటుడు ఎన్టీఆర్‌తో కలిసి ‘దేవర’ (Devara)లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ.. తన తల్లి శ్రీదేవిని గుర్తు తెచ్చుకుంది.
కెరీర్ తొలినాళ్లలో శ్రీదేవి కూతురునన్న కారణంగా అభద్రతా భావనకు గురైనట్లు చెప్పుకొచ్చింది. అందువల్లనే తొలి సినిమా సమయంలో తన తల్లి సలహాలు, సూచనలు తీసుకోలేదని తెలిపింది. సినిమా సెట్స్‌కు కూడా తల్లి శ్రీదేవిని రావొద్దని చెప్పినట్టుగా జాన్వీ చెప్పుకొచ్చింది. ‘సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో శ్రీదేవి కూతుర్ని కావడంతోనే నాకు అవకాశాలు వచ్చాయని అందరూ అన్నారు. ఆ మాటలను నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. అందుకే అమ్మ సలహాలు, సూచనలతోపాటు తన సపోర్ట్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో సొంతంగా నాకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నా. అందుకే అప్పుడు నా తొలి సినిమా సెట్స్‌కు కూడా ఆమెను రావొద్దని చెప్పా. నాకు ఎలాంటి సాయం చేయొద్దని కోరాను. ఒకానొక సమయంలో ఆమె కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నందుకు అభద్రతా భావనకు గురయ్యా. ఆ సమయంలో అమ్మను చాలా దూరం పెట్టా. అప్పుడు అమ్మ విషయంలో నేను ఎంత తెలివితక్కువగా ఆలోచించానో ఇప్పుడు అర్థమవుతోంది’ అంటూ జాన్వీ ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ భావోద్వేగానికి గురైంది.
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో (విలన్‌గా) నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. దేవర పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
Also Read..
Devil | కల్యాణ్‌రామ్ డెవిల్ నుంచి దూరమే తీరమై సాంగ్ లుక్
Devara | జూనియర్ ఎన్టీఆర్ దేవరపై శ్రీకాంత్ ఏమన్నాడంటే..?
Salaar Movie | ప్రభాస్ ‘సలార్’ మూవీలో జాంబీలు.. నీల్ మామా ఏం ప్లాన్ చేస్తున్నావు.?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

