Salaar Dubbing | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న తాజా చిత్రం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ (Salaar: Part 1 – Ceasefire) కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న విడుదల కానుంది. మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ రూమర్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో ఒక జాంబీ (Zombie Fight) ఫైట్ ఉందని తెలుస్తుంది. వందలాది జాంబీలు (Zombies) మూకుమ్మడిగా కలిసి దేవ మీద దాడి చేస్తే.. వాటిని ప్రభాస్ ఊచకోత కోస్తాడని.. ఈ ఒక్క సీక్వెన్స్ సలర్ సినిమాకే హైలెట్‌గా ఉంటుందని ఈ మూవీకి డబ్బింగ్ చెప్పిన టాలీవుడ్ సినీయర్ నటుడు తెలిపాడు. దీంతో అసలు ప్రశాంత్ నీల్ ఏం ప్లాన్ చేశాడో అన్న ఊహే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక ఈ సీన్ వల్లే సినిమాకు A సర్టిఫికేట్ వచ్చినట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
Zombies fight a eam plan chesara#Salaar #Prabhas 🥵pic.twitter.com/dgUQT8CTjj
— . (@Praveenmudhir1) December 14, 2023
మరోవైపు ఇటీవలే సలార్ ఫస్ట్ సింగిల్ సూరీడే (Sooreede) లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. సూరీడే గొడుగు పట్టి.. వచ్చాడే భుజం తట్టి చిమ్మ చీకటిలో నీడలా ఉండెటోడు.. అంటూ సాగుతున్న ఈ పాట సలార్, వరద రాజ మన్నార్ స్నేహం నేపథ్యంలో సాగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసిన సూరీడే లిరికల్ వీడియో సాంగ్ నెట్టింట వ్యూస్ పంట పండిస్తూ.. టాక్ ఆఫ్ ది టౌన్ నిలుస్తోంది. సలార్‌లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. జగపతిబాబు, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్, పృథ్విరాజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.