Chennai Rains | మిచౌంగ్ తుఫాన్ (Cyclone Michaung) కారణంగా సంభవించిన వరదల నుంచి కోలుకోకముందే తమిళనాడు చెన్నై (Chennai)ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. శుక్రవారం చెన్నైలో భారీ వర్షం (Heavy rain) కురిసింది. ఈ వర్షం కారణంగా ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొన్న సంభవించిన వరద నుంచి తేరుకోకముందే మరోసారి వర్షం పడటంతో చెన్నై వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
మరోవైపు నేటి నుంచి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. రానున్న మూడు రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మరోవైపు డిసెంబర్ 17వ తేదీన కేరళ, లక్షద్వీప్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆ రెండు రాష్ట్రాల్లో వచ్చే రెండు వారాల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
#WATCH | Heavy rain lashes Tamil Nadu’s Chennai pic.twitter.com/lrN3tdAVTo
— ANI (@ANI) December 15, 2023
Also Read..
Security Heightened | భద్రతా వలయంలో పార్లమెంట్ భవనం.. డేగ కళ్లతో పహారా కాస్తున్న సిబ్బంది
Sabarimala Temple | అయ్యప్ప భక్తులతో కిక్కిరిసిన శబరిమల.. కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్స్