e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News టీ న్యూస్‌, న‌మ‌స్తే తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌కు బండి సంజ‌య్ బెదిరింపులు

టీ న్యూస్‌, న‌మ‌స్తే తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌కు బండి సంజ‌య్ బెదిరింపులు

టీ న్యూస్‌, న‌మ‌స్తే తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌కు బండి సంజ‌య్ బెదిరింపులు

హైద‌రాబాద్ : బీజేపీ నేత‌ల‌కు అబ‌ద్దాలు, అడ్డ‌గోలు మాట‌లు చెప్ప‌డం వెన్న‌తో పెట్టిన విద్య‌. బెదిరింపుల‌కు పాల్ప‌డి ప్ర‌జ‌ల‌ను భయబ్రాంతులకు గురి చేసే బండి సంజ‌య్.. ఈసారి ఏకంగా జ‌ర్న‌లిస్టుల‌పైనే రుస‌రుస‌లాడారు. క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా తెలంగాణ‌కు స‌రిప‌డా వ్యాక్సిన్లు కేంద్రం ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌శ్నించిన టీ న్యూస్, న‌మ‌స్తే తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌పై బండి సంజ‌య్ రెచ్చిపోయారు. టీ న్యూస్, న‌మ‌స్తే తెలంగాణ రిపోర్ట‌ర్ల‌ను ఉద్దేశించి.. ఫ‌స్ట్ నువ్వు బ‌య‌ట‌కు వెళ్లు.. ఏం త‌మ‌షా చేస్తున్నావా? అంటూ రౌడీలా చేతులు చూపిస్తూ, బెదిరిస్తూ ఊగిపోయారు. మ‌ర్యాద‌గా మాట్లాడండి అన్న ఓ రిపోర్ట‌ర్ ప‌ట్ల.. అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తిస్తూ మ‌ర్యాద ఏంది అంటూ కన్నెర్ర చేశాడు బండి సంజ‌య్. ప్ర‌శ్న‌కు స‌మాధానం దాట‌వేయొచ్చు కానీ విచ‌క్ష‌ణ లేకుండా జ‌ర్న‌లిస్టుల ప‌ట్ల రెచ్చిపోయాడు బండి సంజ‌య్.

తీవ్రంగా ఖండించిన మంత్రి త‌ల‌సాని, ఎమ్మెల్యే బాల్క సుమ‌న్

జ‌ర్న‌లిస్టుల ప‌ట్ల దురుస‌గా ప్ర‌వ‌ర్తించిన బండి సంజ‌య్‌పై మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ మండిప‌డ్డారు. జ‌ర్న‌లిస్టుల‌ను అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించ‌డం స‌రికాద‌ని, బీజేపీ నేత‌లు విచ‌క్ష‌ణ కోల్పోయి మాట్లాడుతున్నార‌ని వారు పేర్కొన్నారు. జ‌ర్న‌లిస్టుల ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించి, వారిని దుర్భ‌ష‌లాడిన బండి సంజ‌య్ తీరును వారు త‌ప్పుబ‌డుతూ, తీవ్రంగా ఖండించారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

బీజేపీ ఎంపీల‌కు మంత్రి త‌ల‌సాని హెచ్చ‌రిక‌

బండి నీకు ద‌మ్ముంటే కేంద్రాన్ని నిల‌దీయాలి : బాల్క సుమ‌న్

క‌రోనాపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క సూచ‌న‌లు

సీఎం కేసీఆర్‌కు మంత్రి ఈట‌ల శాఖ‌.. గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టీ న్యూస్‌, న‌మ‌స్తే తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌కు బండి సంజ‌య్ బెదిరింపులు

ట్రెండింగ్‌

Advertisement