వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో(Vikarabad district) దారుణం చోటు చేసుకుంది. ఎనిమిదో తరగతి చదవుతున్న 13 ఏళ్ల బాలికపై 4 మైనర్లు లైంగిక దాడికి(Assault) పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా దోమ పోలిస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ముబావంగా ఉన్న బాలికను తల్లిదండ్రులు ప్రశ్నించడంతో జరిగిన ఘోరాన్ని వివరించింది. దీంతో సదరు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.