Peddi Sudarshan Reddy | ప్రజానాయకుడు, ఉద్యమనేత దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శర్రెడ్డిపై కాంగ్రెస్(Congress) పార్టీ కక్షగట్టింది. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న పెద్ది స్వరాష్ట్రంలో కూడా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా అంతే చురగ్గా పాల్గొన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను అంటూ క్షణాల్లో ప్రజల పక్షాన నిలిచి సమస్యలు పరిష్కరించే వాడు. అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి నర్సంపేటలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ఎదుగుదలను చూసి సహించలేకపోయిన సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి పెద్ది చనిపోయాక ప్రతీకారం(Revenge) తీర్చుకున్నారు. నేడు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పుట్టినరోజు నాడే ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని 1500 మంది పోలీసుల బందోబస్తుతో కూలగొట్టి ఆ ప్రదేశాన్ని అధికారులు చదును చేశారు.
కాగా, సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న(Peddi Swapna) విగ్రహం వద్ద రోదిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. భర్తను తలచుకొని కన్నీటి పర్యంతమవుతూ “నువ్వు లేని రోజు చూడు.. ఎంత అరాచకమో” అంటూ విలపించారు. ఆమె రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. కుటుంబం గురించి కాకుండా ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించిన వ్యక్తి విగ్రహం తొలగించడం తట్టుకోలేకపోతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఎక్కడో బయట చౌరస్తాలో పెట్టలేదు.. అభిమానంతో ఒక వ్యక్తి ప్రైవేట్ స్థలంలో చిన్న విగ్రహం ఏర్పాటు చేశాడు. ఈరోజు దొంతి మాధవరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆ విగ్రహాన్ని కూల్చివేయడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పెద్ది సుదర్శన్ రెడ్డి మీద పగ తీర్చుకున్న రేవంత్, దొంతి
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పుట్టినరోజు నాడే ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసుకున్న దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని 1500 మంది పోలీసుల బందోబస్తుతో కూలగొట్టి చదును చేసిన అధికారులు https://t.co/ZsSgXERYVF pic.twitter.com/J93IaOlTsU
— Telugu Scribe (@TeluguScribe) August 18, 2026