న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా(JP Nadda)కు యాంజియోప్లాస్టీ చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన గుండెకు స్టంట్స్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 13వ తేదీన జేపీ నడ్డాను ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ను అకస్మాత్తుగా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వెంటనే ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ఇక ఆ రోజే కరోనరీ యాంజియోగ్రఫీ కూడా చేశారు. ఆగస్టు 17వ తేదీన మంత్రి జేపీ నడ్డాకు యాంజియోప్లాస్టీ చేసినట్లు ఓ అధికారి తన ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కార్డియాలజీ శాఖలో అబ్జర్వేషన్లో ఉన్నట్లు చెప్పారు.
Official statement by AlIMS, New Delhi regarding the health status of Hon’ble Union Minister of Health and Family Welfare, Shri J.P. Nadda. pic.twitter.com/uskN2kNREc
— AIIMS, New Delhi 🇮🇳 (@aiims_newdelhi) August 18, 2026