పాయల్ చంగప్ప ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘మయూఖ’. శ్రీతేజ్ ఎస్కే దర్శకత్వంలో శశిధర్ నల్ల నిర్మించిన ఈచిత్రం అక్టోబర్ 9న విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ‘మయూఖ’ లాంటి సినిమాలు తెలుగులో అరుదుగా వస్తాయని, హాలీవుడ్, కొరియన్ సినిమాల స్థాయిలో సీజీ వర్క్ ఉంటుందని, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇదని డైరెక్టర్ శ్రీతేజ్ ఎస్కే తెలిపారు.
ఈ సినిమా తర్వాత హీరోయిన్ పాయల్ చంగప్పను అంతా ‘మయూఖ’ అనే పిలుస్తారని నిర్మాత శశిధర్ అన్నారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల పాయల్ చంగప్ప ఆనందం వెలిబుచ్చారు. ఇంకా ఇతర పాత్రధారులు, మాస్టర్ షణ్ముఖ్ చరణ్, బేబీ మది నస్రీన్, నానానీ కర్రీ, దేవ్డి, రఘు వాసిరెడ్డి, అభిలాష్ అడ్డ కూడా మాట్లాడారు.