Peddi Swapna | నర్సంపేటలో అర్దరాత్రి దొంగ చాటుగా కాంగ్రెస్ సర్కార్ పెద్ది సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan reddy) విగ్రహం తొలగించడంతో వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని ఆయన స్వగృహం వద్ద విషాద వాతావరణం నెలకొంది. సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న(Peddi Swapna) విగ్రహం వద్ద రోదిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. భర్తను తలచుకొని కన్నీటి పర్యంతమవుతూ “నువ్వు లేని రోజు చూడు.. ఎంత అరాచకమో” అంటూ విలపించారు. ఆమె రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. కుటుంబం గురించి కాకుండా ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించిన వ్యక్తి విగ్రహం తొలగించడం తట్టుకోలేకపోతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఎక్కడో బయట చౌరస్తాలో పెట్టలేదు.. అభిమానంతో ఒక వ్యక్తి ప్రైవేట్ స్థలంలో చిన్న విగ్రహం ఏర్పాటు చేశాడు. ఈరోజు దొంతి మాధవరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆ విగ్రహాన్ని కూల్చివేయడం బాధాకరమన్నారు.
కాగా, రాత్రి 3 గంటలకు.. 1500 మంది పోలీసుల పహారా మధ్య దొంగచాటుగా దివంగత తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ఉద్యమకారుడి విగ్రహాన్ని అర్ధరాత్రి భారీ బందోబస్తు మధ్య తొలగించడం కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు రాజకీయాలకు పరాకాష్ట అని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక్కడితో ఆగని పోలీసులు వరంగల్ జిల్లా నర్సంపేటలో బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. నల్లబెల్లిలోని పెద్ది నివాసం చుట్టూ 400 మంది పోలీసుల మోహరించారు. దీనిపైబీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఇది ప్రజాస్వామ్య పాలనా? లేక రేవంత్ రెడ్డి సర్కార్ సాగిస్తున్న దమనకాండా? విగ్రహాన్ని దొంగచాటుగా తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లో పెద్ది సుదర్శన్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని ఎప్పటికీ చెరిపివేయలేరు. కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపులకు తెలంగాణ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
నువ్వు లేని రోజు చూడు.. ఎంత అరాచకమో
కంటతడి పెట్టుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పుట్టినరోజు నాడే ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని 1500 మంది పోలీసుల బందోబస్తుతో కూలగొట్టి చదును చేసిన అధికారులు https://t.co/nlhCZjWbKw pic.twitter.com/d5J3eNQ1Lp
— Telugu Scribe (@TeluguScribe) August 18, 2026