Journalist Nagendra Kumar | టాలీవుడ్ నటుడు సంపూర్ణేష్ బాబు ఇటీవల ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ మాట్లాడిన తీరు వివాదాస్పదమైంది. ఇంటర్వ్యూ సమయంలో “అసలు ఈ ఫేస్‌తో హీరో అవుదామని ఇండస్ట్రీలోకి ఎలా వచ్చావు?” అంటూ సంపూని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలు సంపూర్ణేష్ బాబు అభిమానులను, నెటిజన్లను తీవ్రంగా బాధిచాయి. ఒక నటుడిని ఉద్దేశించి అలా మాట్లాడటం తప్పు అంటూ సోషల్ మీడియాలో జర్నలిస్ట్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. నెటిజన్లు ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ వెంటనే స్పందించారు. సంపూర్ణేష్ బాబును ఇబ్బంది పెట్టేలా మాట్లాడినందుకు ఆయనకు, అలాగే ఆయన అభిమానులకు బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు.
Interview ki pilichi mari insult chesthara sir🤦♂️ adhey cinema background unna hero ni ela ne aduguthara #sampurneshbabu #theparadise #nagendrakumar pic.twitter.com/CKoCLfQ6Qu
— TELUGU FAB (@telugufab) September 23, 2026