Sigma Movie | సీఎం విజయ్ తనయుడి ‘సిగ్మా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. గాంధీ జయంతిన రాబోతున్న సందీప్ కిషన్!
Sundeep Kishan | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ యాక్షన్ హీస్ట్ డ్రామా ‘సిగ్మా’. టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
Sundeep Kishan | కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ యాక్షన్ హీస్ట్ డ్రామా ‘సిగ్మా’. టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా అధికారిక విడుదల తేదీని ప్రకటించారు. గాంధీ జయంతి కానుకగా 2026 అక్టోబర్ 2వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ ప్రకటనతో పాటు విడుదల చేసిన సరికొత్త పోస్టర్లో సందీప్ కిషన్ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ఇంటెన్స్ లుక్లో కనికట్టు చేస్తున్నారు.
ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన టాలెంటెడ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తుండగా, నూతన దర్శకుడి ప్రతిభకు తగ్గట్టుగా భారీ తారాగణం ఈ సినిమాలో భాగమైంది. ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాజు సుందరం, వర్సటైల్ యాక్టర్ సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు దాసన్, యోగ్ జాపీ, షీలా రాజ్కుమార్ మరియు కిరణ్ కొండ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ ఈ సినిమాకు అదిరిపోయే సంగీతం అందిస్తుండగా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు మరియు ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల తేదీ ఖరారు కావడంతో, రాబోయే రోజుల్లో టీజర్, పాటలతో పాటు ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Mark the date for the heist on October 2. 💰 #SIGMA is all set to light up the screens. 🔥 @official_jsj @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @sundeepkishan @MusicThaman @fariaabdullah2 #RajuSundaram #SampathRaj @shivpanditt @follow_anbu @yogjapee @MagaAnan… pic.twitter.com/kGcmWQh07Y
— Jason Sanjay Official (@official_jsj) August 18, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

