శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 13, 2020 , 02:23:10

దమ్ముంటే ఏపీ బీజేపీ నేతలను ప్రశ్నించు

దమ్ముంటే ఏపీ బీజేపీ నేతలను ప్రశ్నించు

  • బండి సంజయ్‌కు ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ సవాల్‌
  • సీమకు నీటి అక్రమ తరలింపును సహించబోమని స్పష్టీకరణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడుతు న్న ఏపీ బీజేపీ నేతలను దమ్ముంటే ప్రశ్నించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ సవాల్‌ విసిరారు. పోతిరెడ్డిపాడుపై ఏపీ బీజేపీ నేతలు ఓ రకంగా, తెలంగాణ బీజేపీ నేతలు మరోరకంగా మాట్లాడుతూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని విమర్శించారు. వీరిలో ఎవరి విధానం సరైనదో ఆ పార్టీ జాతీ య నాయకత్వం స్పష్టంచేయాలన్నారు. మంగళవారం వీడియో సందేశం ద్వారా ఆయన మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడుపై బీజేపీలో ఏకాభిప్రాయం వచ్చాక మాట్లాడితే మంచిదని సంజయ్‌కు సూచించారు. ఆయ న ఏం మాట్లాడినా నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కారని స్పష్టంచేశారు. బుధవారం నల్లజెండాలతో ప్రదర్శనలు జరుపాలని బండి పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ర్టానికి కావాల్సింది నల్లజెండాలు, తెల్లటోపీలు కాదని, నిఖార్సుగా నదీ జలాల కోసం కొట్లాడే లక్షణమని చెప్పారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పోతిరెడ్డిపాడు నుంచి నీటి అక్రమ తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం చేసే పోరాటంలో కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు.  ఈనెల 5న ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి 80వేల క్యూసెక్కులను అక్రమంగా తరలించేందుకు జీవో విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ కుట్రను ఎదుర్కొంటామని స్పష్టంచేశారు. రాయలసీమకు అక్రమంగా ఒక్క నీటి బొట్టు ను తరలించినా సహించేది లేదన్నారు. 


logo