e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home తెలంగాణ కేసీఆర్‌తో పెట్టుకున్నోళ్లు పాతాళానికే

కేసీఆర్‌తో పెట్టుకున్నోళ్లు పాతాళానికే

  • సీఎం ముందు రేవంత్‌ రవ్వంత
  • బీజేపీ నేతలకు దమ్ముంటే రైతుల ధాన్యం కొనుగోలు చేయించాలి
  • సింగరేణి కాలనీ ఘటన దురదృష్టకరం: ఆశన్నగారి జీవన్‌రెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 14 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పెట్టుకున్నోళ్లు ఎవరైనా పాతాళానికి పోవుడు ఖాయమని పీయూసీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ముందు రేవంత్‌రెడ్డి రవ్వంత అని చెప్పారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌ వ్యవహారం రోజురోజుకూ శృతి మించిపోతున్నదని మండిపడ్డారు. కాం గ్రెస్‌ పాలిత రాజస్థాన్‌లో లైంగికదాడులు 200 రెట్లు ఎక్కువగా ఉన్నాయని సాక్షాత్తు క్రైం రికార్డుబ్యూరో లెక్కలు చెప్తున్నాయని పేర్కొన్నారు. మహిళల రక్షణలో రాష్ట్రం దేశానికే పాఠాలు నేర్పుతున్నదని, షీ-టీమ్స్‌ ఏర్పాటు మహిళలకు రక్షణ కవచంగా నిలిచిందని గుర్తుచేశారు. సింగరేణి కాలనీలో ఘటన దురదృష్టకరమని, దీనిని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తున్నదని చెప్పారు. దేశానికే తెలంగాణ మార్గదర్శనం చేస్తుంటే కళ్లుండీ చూడలేని కబోదిలా రేవంత్‌ మాట్లాడుతూ, బ్లాక్‌బెయిల్‌ రాజకీయాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారాడని విమర్శించారు. ఒక్క తెలంగాణలోనే ఎక్సైజ్‌ ఆదాయం ఎక్కువగా ఉన్నట్టు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోనూ ఎక్సైజ్‌ ఆదాయాలు ఉన్నాయని, మరి ఆ రాష్ర్టాల సీఎంలు తాగుబోతులా? అని ప్రశ్నించారు. పంజాబ్‌లో డ్రగ్స్‌ మాఫియా చెలరేగిపోయిన వైనానికి ‘ఉడ్తా పంజాబ్‌’ సినిమా నిదర్శమని గుర్తుచేశారు. రేవంత్‌ సహా కాంగ్రెస్‌ నేతలందరూ ఈ సినిమా చూస్తానంటే గాంధీభవన్‌లోనే ఏర్పా ట్లు చేస్తానన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ కార్యాలయాలకు టు లెట్‌ బోర్డులు పెట్టుకోక తప్పదని చెప్పారు. బీజేపీ నేతలకు రాష్ట్ర రైతులపై ప్రేమ ఉంటే ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుని అయినా కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయించాలని డిమాండ్‌ చేశారు.

వచ్చే 20 ఏండ్లు టీఆర్‌ఎస్‌దే అధికారం: ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం

ఎవరెన్ని ఎత్తులు వేసినా ఇంకా 20 ఏండ్లదాకా టీఆర్‌ఎస్‌దే అధికారమని ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం అన్నారు. రాష్ట్రంలో అన్నివర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నారని చెప్పారు. హుజూరాబాద్‌ ఎన్నికల తర్వాత రేవంత్‌ భవితవ్యం ప్రశ్నార్థకమేనని పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌దే విజయమని ధీమా వ్యక్తంచేశారు. సిం గరేణి కాలనీ ఘటనలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందన్నారు. ప్రతి ఘటనను రాజకీయ కోణంలో చూడటం సరికాదని పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana