Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్ల నుంచి డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన సర్క్యూలను కళాశాల విద్య కమిషనర్ జారీ చేశారు. అర్హులైన జూనియర్ లెక్చరర్లు పదోన్నతులు పొందడం కోసం ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
జూనియర్ లెక్చరర్ల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందేందుకు పీజీలో 55 శాతం మార్కులను సాధించి ఉండాలి. నెట్, స్లెట్తో పాటు పీహెచ్డీ కలిగి ఉండాలి. గతంలో జూనియర్ లెక్చరర్లు నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొంది.. తిరిగి జేఎల్కు వెళ్లిన వారు ఇప్పుడు పదోన్నతి పొందేందుకు అనర్హులు. అలాగే జూనియర్ కాలేజీల్లో లైబ్రేరియన్స్గా పనిచేస్తున్న వారు డిగ్రీ కాలేజీల్లో లైబ్రేరియన్స్.. వారితోపాటు ఫిజికల్ డైరెక్టర్లుగా పనిచేస్తూ.. డిగ్రీ కాలేజీల్లో పీడీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KCR | రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
Irani Cup 2024 | ఇరానీ కప్ ముంబైలో కాదు.. కారణమిదే..?
Mehreen pirzada | కొంటెచూపులతో మెహ్రీన్ అందాల వల