సూర్యాపేట : సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర హనుమాన్ దేవాలయంలో ఆదివారం గదుల నిర్మాణం కోసం పిల్లర్ గుంతలు తీస్తుండగా పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. శ్రీదేవి, భూదేవి, మహావిష్ణు, రుక్మిణి, సత్యభామ, వేణుగోపాల స్వామి, లక్ష్మణుడు, అల్వార్లు, ద్వారపాలకులు, మూడు అడుగుల లక్ష్మీనారాయణ విగ్రహంతో పాటు మరి కొన్ని మొత్తం 18 విగ్రహాలు బయటపడ్డాయి.
ప్రజలు ఆశ్చర్యంగా వాటిని తిలకించారు. ఇవి ఏ కాలం నాటిది ఎక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన అని చర్చించుకున్నారు. స్థానికులు పురావావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఇవి కూడా చదవండి..
Medaram | ఇక కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే వనదేవతల దర్శనం
సంపూర్ణ ఆరోగ్య తెలంగాణకు ప్రభుత్వం కృషి : మంత్రి హరీశ్‌రావు
చప్పట్లతో కరెంట్ మోటర్ ఆన్, ఆఫ్..నాగర్‌కర్నూల్ యువకుడి ప్రతిభ