Maheshwar Reddy | రుణమాఫీ పేరుతో రేవంత్‌రెడ్డి సర్కారు మరోసారి రైతులను మోసం చేసిందని శాసనసభలో బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. 60లక్షల మంది రైతులు అర్హులుండగా.. కేవలం 22 లక్షల మందికే రుణమాఫీ జరిగిందన్నారు. రూ.49వేలకోట్లు రుణమాఫీకి ఇవ్వాల్సి ఉండగా.. కేవలం రూ.17వేలకోట్లే ఇచ్చారని విమర్శించారు. రుణమాఫీ కాని రైతులను కూడా మోసం చేసేందుకే దరఖాస్తులు చేసుకోమన్నారని.. ఇదీ మోసమే ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయలేకనే రేవంత్ సర్కార్ చేతులెత్తేసిందని ఆరోపించారు. రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతను తగ్గించేందుకు కొత్త డ్రామాకు తెరతీశారన్నారు. రైతులందరికీ రుణాలు మాఫీ చేసామంటున్న సీఎం తమ రుణాలు మాఫీ కాలేదంటూ క్షేత్రస్థాయిలో నిరసనలు తెలుపుతున్న రైతులకు ఏం సమాధానం చెప్తారన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దమ్ముంటే గ్రామాలకు వెళ్లి పూర్తి స్థాయిలో రైతులకు రుణాలు మాఫీ అయ్యాయో లేదో ఆరా తీయాలన్నారు. మూడువిడతల్లో రుణమాఫీ చేసిన రైతుల వివరాలు వారం రోజుల్లోగా ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న రైతుల రుణాలను ప్రభుత్వం ఈ నెలాఖరులోగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా పథకానికి మార్గదర్శకాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ తక్షణమే ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించాలన్నారు. నివేదికపై చర్చించి రైతు భరోసా స్కీమ్ గైడ్‌లైన్స్‌ను ఖరారు చేసేందుకు వెంటనే అసెంబ్లీని సమావేశ పరచాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా ఖరీఫ్ సీజను డబ్బులను ఈ నెలాఖరులోగా రైతులకు ఇవ్వాలన్నారు. వరంగల్‌లో రుణమాఫీ కృతజ్ఞత సభ పెట్టండి.. రైతులే మిమ్మల్ని ఏమని ప్రశ్నిస్తారో చూడాలన్నారు.
KTR | ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం : కేటీఆర్
Jagadish Reddy | రైతులంతా ఏకమవ్వాలి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడాలి.. జగదీశ్‌రెడ్డి పిలుపు
Harish Rao | దమ్ముంటే రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. హరీశ్‌రావు డిమాండ్