భద్రాద్రి కొత్తగూడెం : పెండింగ్ బిల్లుల మంజూరు కోసం లంచం(Bribe) డిమాండ్ చేసి ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి(ACB) చిక్కారు. వివరాల్లోకి వెళ్తే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి ఎంపీడీవో (Allapally MPDO,) కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మర్కోడ్ మాజీ ఉపసర్పంచ్ కుర్ర కమల దగ్గర పెండింగ్ కాంట్రాక్టు బిల్లుల కోసం రూ.15000 డిమాండ్ చేశారు. దీంతో చేసిది ఏమి లేక ఉప సర్పంచ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు ఆళ్లపళ్లి ఎంపీడీఓ శ్రీనివాస్, మర్కోడ్ పంచాయతీ సెక్రటరీ నాగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Yuvaraj Singh | తెరపైకి క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్.. వివరాలివే
SDGM | మాస్ ఫీస్ట్ పక్కా.. గోపీచంద్ మలినేని ఎస్డీజీఎంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్..!