ఆదివారం 17 జనవరి 2021
Telangana - Jan 14, 2021 , 15:34:54

ముగిసిన కస్టడీ.. చంచల్‌గూడ జైలుకు అఖిలప్రియ

ముగిసిన కస్టడీ.. చంచల్‌గూడ జైలుకు అఖిలప్రియ

హైదరాబాద్‌ : మూడ్రోజుల కస్టడీ అనంతరం అఖిలప్రియను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తిరిగి తరలించారు. వ్యాపారి ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. కేసులో ఏ1 నిందితురాలైన అఖిలప్రియను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. న్యాయస్థానం కస్టడీకి అనుమతించడంతో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ఆమెను విచారించారు.

కస్టడీ ముగియడంతో గురువారం ఉదయం ఆమెకు బేగంపేట పీహెచ్‌సీలో కరోనా పరీక్షలు నిర్వహించారు. నెగెటివ్‌గా నిర్ధారణ కావడంతో తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం అఖిలప్రియను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరు పరిచారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. అఖిలప్రియ తరపున న్యాయవాదులు బెయిల్‌ పిటిషన్‌ దాఖ‌లు చేశారు. బెయిల్‌ పిటిషన్‌పై ఎల్లుండి విచారణ జరగనుంది.