Adilabad | ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. నార్నూర్ మండలం భీంపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో.. ఓ విద్యార్థి ఖోఖో ఆడుతూ కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన స్కూల్ టీచర్లు.. హుటాహుటిన బాధిత విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడిని బన్నీ(14)గా గుర్తించారు. తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.
అయితే రిపబ్లిక్ డేను పురస్కరించుకుని.. పాఠశాలలో గేమ్స్ ఆడిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బన్నీకి గతంలో గుండెపోటు రావడంతో స్టెంట్లు వేసినట్లు తెలుస్తోంది. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. స్నేహితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Mahabubabad | ఇందిరమ్మ పథకం, ఈ పథకం, ఆ పథకం, బొంగు భోషాణం.. అధికారులపై మహిళ ఫైర్
Congress | ఇందిరమ్మ రాజ్యంలో మృత్యు ఘోష.. ప్రజల ప్రాణాలు తీస్తున్న కాంగ్రెస్ పథకాలు
Mulugu | ఇందిరమ్మ ఇల్లు రాలేదని పురుగుల మందు తాగిన వ్యక్తి.. హాస్పిటల్కు తరలింపు