నిర్మల్ : బేస్ బాల్(Baseball) ఆడుతూ ఓ విద్యార్థి మృత్యు ఒడిలోకి చేరిన విషాదకర సంఘటన మంగళవారం ఉదయం నిర్మల్(Nirmal )జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎంజేపీ పాఠశాలలో తొమ్మిదవ తరగతి విద్యార్థి ఫయాజ్ హుస్సేన్ ఉదయం బేస్ బాల్ ఆడుతూ అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన ఉపాధ్యాయులు వెంటనే ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు విద్యార్థి మృతి చెందినట్లు ధృవీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.