హైదరాబాద్ : నేడు ఇందిరా పార్క్ వద్ద జరిగే ఆటో డ్రైవర్ల మహాధర్నా(Auto drivers mahadharna) కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పాల్గొననున్నారు. ఆటో డ్రైవర్ల మహాధర్నాకు మద్దతు తెలుపనున్నారు. కాగా, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టిన ఈ నెల 5న ఇందిరాపార్క్ వద్ద జరిగే చలో హైదరాబాద్ మహా ధర్నాను జరిపి తీరుతామని తెలంగాణ ఆటో యూనియన్ జేఏసీ స్పష్టం చేసింది.
ధర్నాకు ఆటంకం కలిగించడానికి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వెనుకడుగు వేయకుండా డ్రైవర్లంతా తరలిరావాలని పిలుపునిచ్చింది. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు. అన్ని వాహన సంఘాలతో కలిపి మహాధర్నా విజయవంతం చేస్తామని తెలిపారు. ప్రజా పాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కారు.. ఆంక్షల పేరుతో వేధించడం సరి కాదన్నారు.
Also Read..
Samantha | బరువు పెరగండి అంటూ నెటిజన్ కామెంట్.. సీరియస్ అయిన సమంత
Devara | దేవర వచ్చేస్తున్నాడు.. ఓటీటీ ప్లాట్‌ఫాంలో తారక్ మూవీ స్ట్రీమింగ్ టైం ఫిక్స్